సప్తపది ఏడడుగుల సంబంధం అంటే ఏమిటి?
వివాహసమయంలో వధూవరుల చేత ” సప్తపది” జరిపిస్తారు. కొందరు పురోహితులు సప్తపదిని తప్పించేస్తుంటారు. గబా గబా వివాహం అయిపోయిన్దనిపించుకొని మరొక ముహూర్తానికి పరుగులు తీయటం మనం ఎన్నో చోట్ల చూస్తున్నాము. తాళి కట్టటం వివాహ ముఖ్య కర్తవ్యం అనుకుంటారేమో! మనం మన బందువుల వివాహానికి వెళ్ళినపుడు మీరు గమనించేవుంటారు. “పంతులుగారు! త్వరగా కానివ్వండి. అవతల టైం అవుతోంది” అంటూ తొందర చేస్తుంటారు. ఇది ఎంతవరకు సబబు అంటారు? పెళ్లిని నూరేళ్ళ పంటగా పెద్దలు చెబుతారు. అలాంటి జీవిత శుభాకార్యాన్ని పరుగులు తీస్తూ చేయించటం వివేకవంతమైన విషయమా? ఒక్క సారి ఆలోచించండి.
కట్నం కోసం వరుడి తల్లిదండ్రులు, బాద్యత దిమ్పుకోవటం కోసం వధువు తల్లిదండ్రులు, పెండ్లి త్వరగా ముగిస్తే ఇంటికి చేరుకొందామని అరగంటకొక సారి వాచీలు చూచుకొనే బంధువులు పెండ్లి పీటల మీద కూర్చొని యాంత్రికంగా పురోహితుడు చెప్పింది చేస్తూ మరేదో ఆలోచిస్తూ, స్నేహితుల కోసం అటు ఇటూ చూసే పెండ్లి కుమారుడు, పెండ్లికి కట్టుకున్న పదివేల రూపాయల చీర అందరికి నచిందో లేదోనని, పెండ్లికి చేయించుకొన్న బంగారు హారం సరిగా లేదని ఆలోచించే పెండ్లికూతురు, ఇలా జరిగే తంతును పవిత్ర వివాహమంటార?
మన పెద్దలు ఏది చేసిన అనుభవ పూర్వకంగా నే చేస్తూవోస్తున్నారు. తలనెరిసిన వారందరూ పెద్దవాళ్ళ? నేటి ప్రపంచం లో చిన్న పిల్లలకి కూడా తలనేరుస్తుంది అంత మాత్రాన వారిని పెద్దలంటామా చెప్పండి? మనము మన పెద్దల అనుభవానికి, వారి పెద్ద మనసుకి, గౌరవాన్ని ఇచ్చి, వారు చెప్పే మాటలని, పద్దతులని పాటిస్తాము అవునా?
“పెద్దల మాట సద్ది మూట” అంటారు వారు ఏది చెప్పిన మన మంచి కోసం, మనము పదికాలాలు చల్లగా ఉండాలని చెపుతారు.
Seven Steps ఏడుఅడుగులు
సప్తపది ఏడడుగుల బంధం గురించి తెలుసుకుందాం
“సప్తపది అంటే ఏడడుగులు కల్సినడవటం”
“సఖా సప్త పదా భవ”
ఇద్దరు ఏడడుగులు కలిసివేస్తే మిత్రత్వం కల్గుతుందని శాస్త్రం !
వరుడు వధువు నడుము పై చేయివేసి దెగ్గరగా తీసుకొని అగ్నిహోత్రమునకు దక్షిణవైపున నిలబడి తూర్పుదిక్కువైపుగా ఇద్దరూ ముందుగా కుడి అడుగు పెట్టి అడుగులు నడవాలి. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్ధం వచ్చే మంత్రం చెబుతాడు పురోహితుడు.
“మొదటి అడుగు”
“ఏకం ఇషే విష్ణు త్వా ఆశ్వేతు”
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక!
“రెండవ అడుగు”
“ద్వే ఊర్జే విష్ణు త్వాఅన్వేతు”
ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తి లభించునట్లు చేయుగాక!
“మూడవ అడుగు”
“తీణి వ్రతాయ విష్ణు త్వా అన్వేతు”
ఈ మూడవ అడుగు వివాహవ్రాతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహించుగాక!
“నాలుగోవ అడుగు”
“చాత్వారి మయోభావాయ విష్ణు త్వా అన్వేతు”
ఈ నాలుగోవ అడుగు మనకు ఆనందమును విష్ణువు కల్గిన్చుగాక!
“ఐదవ అడుగు”
“పంచ పశుభ్యో విష్ణు త్వా అన్వేతు”
ఈ ఐదవ అడుగు మనకు పశు సంపదను విష్ణువు కల్గిన్చుగాక!
“ఆరవ అడుగు”
షడ్రుతుభ్యో విష్ణు త్వా అన్వేతు”
ఈ ఆరవ అడుగు ఆరు ఋతువులు మనకు సుఖమిచ్చుగాక!
“ఏడవ అడుగు”
“సప్తభ్యో హూతాభ్య విష్ణు త్వా అన్వేతు”
ఈ ఏడవ అడుగు గృహస్తాశ్రమ ధర్మ నిర్వాహణకు విష్ణువు అనుగ్రహించుగాక!
వివాహంలో ఇది సప్తపది మాత్రమె! వివాహ కార్యక్రమంలో జరిపించే ఒక్కొక్క కార్యక్రమం ఎంతో మనోహరంగానుహృదయంగ మంగాను వుంటుంది. పూర్వికులు వంశంకోసం, వంశాభివృద్ధికోసం, వంశాకీర్తికోసం, ఎంతగా పరితపించిపోయారో వివాహ మంత్రాలలో తెలుస్తోంది. భార్య భర్త ఏ విధంగా ఆడరించాలో, భర్తను భార్య ఏ విధంగా గౌరవించాలో వివాహ మంత్రాలలో చక్కగా వుంది.
వివాహం పవిత్ర కార్యంగా చెప్పారు మన ఋషులు.
సప్తపది(Seven Steps) ఏడడుగుల సంబంధం గురించి, ప్రతి అడుగు వేసేటప్పుడు చదివే మంత్రాల అర్ధం గురించి ఒక పుస్తకం లో, పూజ్యులు జి.వి.శర్మ గారు వివరించారు. మీతో ఆ వివరణ పంచుకోవాలనే ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
మన పురాణాలను, మన ఆచారాలను, మన కావ్యాలను, మన భాషను మనమే వెక్కిరించినట్టూ కువిమర్శలు చేయటం సమంజసమ? ఒక్కసారి సావధానంగా ఆలోచించండి?
ఈ ఆర్టికల్ యువతరాన్ని కాని,పెద్దలని కాని, చిన్నబరచే వుద్దేశం తో రాసినది కాదు అని మనవి!